ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం!
- బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
- ఘటనాస్థలి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 34 మంది నక్సలైట్ల హతం
- బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బీజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్
ఈ ఘటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 34 మంది నక్సలైట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మొదటి దశ సాధారణ ఎన్నికలలో భాగంగా ఇక్కడ ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది.