20 కోట్ల ఖర్చు .. 200 కోట్ల వసూళ్లు .. మలయాళ మూవీ సంచలనం!
Add ap7am to your home Screen

20 కోట్ల ఖర్చు .. 200 కోట్ల వసూళ్లు .. మలయాళ మూవీ సంచలనం!

Manjummel Boys Movie Update
  • ఫిబ్రవరి 22న విడుదలైన 'మంజుమ్మెల్ బాయ్స్'
  • యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా 
  • రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన కంటెంట్ 
  • ఈ నెల 29వ తేదీన తెలుగులో రిలీజ్ చేసే ఛాన్స్   

మలయాళ సినిమాలు ఈ మధ్య కాలంలో సరికొత్త రికార్డులను వసూలు చేస్తున్నాయి. ఒకప్పుడు అక్కడ స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే లభించే వసూళ్లు, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు రాబట్టేస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా 'మంజుమ్మెల్ బాయ్స్ ' చేరిపోయింది. ఫిబ్రవరి 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సౌబిన్ షాహిర్ .. బాబు షాహిర్ .. షావన్ ఆంటోని నిర్మించిన ఈ సినిమాకి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ తెరకెక్కింది. కేరళకి చెందిన కొంతమంది విద్యార్థులు, తమిళనాడు ప్రాంతానికి విహారానికి వెళతారు. ఊహించని విధంగా అక్కడి గుహలో వారు చిక్కుకుపోతారు. లోపల వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు?  ఎలా బయటపడ్డారు? అనేదే కథ. 

ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 200 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అనుక్షణం ఉత్కంఠను కలిగించే ఈ సినిమాను, మైత్రీ మూవీస్ వారు తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను ఇక్కడి థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. 

Advertisement
Manjummel Boys
Soubin Shahir
Sreenath Bhasi
Balu Varghese

More Telugu News