తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన కలిశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను వరుసగా కలుస్తున్నారు. రఘువీరా రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు.

Revanth Reddy
raghuveera reddy
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News