జనసేన - టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు నెలకొన్నాయి: బాలశౌరి
- వైసీపీ పాలనలో అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందన్న బాలశౌరి
- వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
- టీడీపీ - జనసేనలు ఘన విజయం సాధిస్తాయని ధీమా
వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... టీడీపీ - జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని... వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు దివిసీమ ప్రాంతానికి తీరని కల అని... దాన్ని నిజం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు.