అప్పుడు 'నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్' అని ప్రజలను రెచ్చగొట్టి... ఇప్పుడు ఫీజు వసూలు చేయడమా?: హరీశ్ రావు
- హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శ
- అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పి, మాట తప్పారని ఆగ్రహం
- ఎల్ఆర్ఎస్‌ను ఎలాంటి ఫీజు లేకుండా అమలు చేయాలని డిమాండ్
నో ఎల్ఆర్ఎస్ - నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్ఆర్ఎస్‌కు ఫీజులు వసూలు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్‌ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.