లండన్ లో విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రభాస్.. అద్దె ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

Prabhas new house in London
షార్ట్స్‌లో చూడండి
'సలార్' మూవీతో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్... మరో రెండు నెలల్లో 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మే 9న ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. లండన్ లో ప్రభాస్ ఓ విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ప్రభాస్ అక్కడకు వెళ్లినప్పుడు ఉండేందుకు ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉంది. నెలకు అద్దె రూ. 60 లక్షలట. 

బాలీవుడ్ స్టార్లు ఎక్కువగా విదేశాల్లో గడుపుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్లకు కూడా విదేశాలపై మోజు పెరుగుతోంది. మహేశ్ బాబు ఇప్పటికే దుబాయ్ లో ఓ ఇంటిని తీసుకున్నాడు. మరోవైపు కల్కి సినిమా ప్రమోషన్స్ ను మార్చి మధ్యలో ప్రారంభించబోతున్నారట. ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Go Back to Shorts
Prabhas
Tollywood
Bollywood
London
House

More Telugu News