క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు లేఖ
- నియోజకవర్గ ప్రజలకు లేఖ రాసిన ఎంపీ
- నరసరావుపేట ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని వ్యాఖ్య
- నియోజకవర్గ అభివృద్దికి మరోమారు గెలిపించాలని విజ్ఞప్తి
ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానం మరువలేనివని ఆ లేఖలో పేర్కొన్నారు. పల్నాడు అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేస్తున్నట్టు చెప్పారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తానని, మరోమారు అవకాశం ఇస్తే అభివృద్ధిలో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని లేఖలో పేర్కొన్నారు.