మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్
- ఈరోజు ప్రారంభమైన మేడారం జాతర
- వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
- సమ్మక్క - సారలమ్మలకు ప్రణమిల్లుదామన్న మోదీ
మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క - సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని అన్నారు. సమ్మక్క - సారలమ్మలకు ప్రణమిల్లుదామని... వారు వ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని చెప్పారు.