సానియా మీర్జా అంటూ కేకలు.. షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం... వీడియో ఇదిగో

Bitter experience to Shoaib Malik 3rd wife Sana Javed
  • వైవాహిక బంధానికి ముగింపు పలికిన సానియా, షోయబ్ మాలిక్
  • సినీ నటి సనాను పెళ్లాడిన మాలిక్
  • క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సనాను ఆట పట్టించిన ప్రేక్షకుడు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వైవాహిక బంధం ముగిసిన సంగతి తెలిసిందే. సానియా నుంచి విడిపోయిన షోయబ్ మాలిక్... పాక్ సినీ నటి సనా జావెద్ ను పెళ్లాడాడు. వీరి వివాహంపై అటు పాకిస్థాన్ లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్లి కాగా... సనాకు రెండో వివాహం. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచి సనాకు తాజాగా చేదు అనుభవం ఎదురయింది. 

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ - కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ చూసేందుకు సనా క్రికెట్ స్టేడియంకు వచ్చింది. కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న మాలిక్ ఆటను చూసేందుకు ఆమె వచ్చింది. ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా... ఓ ప్రేక్షకుడు ఆమెను ఆట పట్టించారు. పదేపదే సానియా మీర్జా అంటూ కేకలు వేశాడు. దీంతో, తీవ్ర అసంతృప్తికి గురైన సనా... కోపంగా వెనక్కి చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Sana Javed
Shoaib Malik
Sania Mirza
Pakistan

More Telugu News