ఈ జోడీకున్న క్రేజ్ వసూళ్లు కురిపించడం ఖాయమేనేమో!

ఈ జోడీకున్న క్రేజ్ వసూళ్లు కురిపించడం ఖాయమేనేమో!

Ranabaali Movie Update
  • వరుస ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ
  • ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రణబాలి'
  • దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలవుతున్న సినిమా
  • పెళ్లి తరువాత తెరపై సందడి చేయనున్న జోడీ

కొంతమంది హీరోలకి ఒక అరుదైన అవకాశం లభిస్తూ ఉంటుంది. వాళ్లు సాధించిన హిట్ ఒకటి, ఆ తరువాత వచ్చిన వరుస ఫ్లాపులపై విరుగుడుగా పనిచేస్తూ ఉంటుంది. భారీ పరాజయాలు కూడా వాళ్ల కెరియర్ పై అంతగా ప్రభావం చూపించవు. ఆడియన్స్ వాటిని గురించి పెద్దగా పట్టించుకోరు .. మాట్లాడుకోరు. అలాంటి ఒక అరుదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ఎప్పటికప్పుడు ఆయన నుంచి వచ్చిన ఫ్లాపులను పక్కనపెట్టి, కొత్త ప్రాజెక్టులను ఆదరించడానికి ఆడియన్స్ సిద్ధమైపోతూ ఉంటారు. 

అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు  రావడానికి 'రణబాలి' రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా కానుకగా అక్టోబర్ 16వ తేదీన విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన సినిమా ఇది. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన రష్మిక సందడి చేయనుంది. గతంలో 'గీతగోవిందం' .. 'డియర్ కామ్రేడ్' సినిమాలతో అలరించిన ఈ జంటకి ఇది మూడో సినిమా కావడం విశేషం. 

18వ శతాబ్దం కాలం నాటి కథా నేపథ్యం .. అందుకు తగిన గెటప్పులతో విజయ్ దేవరకొండ - రష్మిక కనిపించనుండటం .. పెళ్లి తరువాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం ఈ సినిమా ప్రత్యేకతలుగా కనిపిస్తున్నాయి. ఇక ఇంతవరకూ లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సినిమాలను చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ, తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథను ఎంచుకోవడం మరో విశేషంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ - రష్మిక కాంబినేషన్ ను తెరపై చూడాలని ముచ్చటపడుతున్న ఆడియన్స్, ఈ సినిమాకి ఏ స్థాయిలో పట్టం కడతారనేది చూడాలి.

Advertisement
Vijay Deverakonda
Rashmika Mandanna
Ranabali Movie
Rahul Sankrityan
Mythri Movie Makers
Telugu Cinema

More Telugu News