ఎమ్మెల్యే లాస్య నందితను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్
- ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే
- తలకు గాయాలవ్వడంతో పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రులు
- ‘ఎక్స్’ వేదికగా ఫొటోలు షేర్ చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే
నల్లగొండ మండలం చర్లపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ హోంగార్డు చనిపోయాడు. మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఎమ్మెల్యే సోదరి నివేదిత, ఇద్దరు గన్మెన్లకు కూడా స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే.