నాని తరువాత ప్లేస్ లో వినిపిస్తున్న సుహాస్ పేరు!
Add ap7am to your home Screen

నాని తరువాత ప్లేస్ లో వినిపిస్తున్న సుహాస్ పేరు!

Suhas Special
  • ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన సుహాస్ 
  • చిన్నవేషాలతో కెరియర్ మొదలెట్టిన నటుడు  
  • విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళ్లిన తీరు 
  • రీసెంట్ సినిమాతో అందుకున్న హ్యాట్రిక్ హిట్

సినిమా అంటేనే కోట్ల రూపాయల బిజినెస్. మిగతా ఏ బిజినెస్ చేసినా నష్టపోతే ఆ బిజినెస్ కి సంబంధించిన ఏదో ఒక పదార్ధం కళ్లముందు కనిపిస్తుంది. కానీ సినిమా విషయంలో అలా కాదు .. నష్టపోతే ఇక్కడ ఏదీ కనిపించదు .. ఎవరికీ ఆ నష్టపోయినవారు కనిపించరు. అందువలన ఇక్కడ ఎవరూ ఎవరినీ నమ్మేసి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టరు. అలాంటి నిర్మాతల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి కావలసింది టాలెంట్ మాత్రమే. అయితే ఆ టాలెంట్ ను నిరూపించుకునేందుకైనా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వాల్సిందే. అలాంటి అవకాశాన్ని అందుకోవాలంటే మాత్రం అందుకు అదృష్టమే కలిసి రావాలి. అలా టాలెంట్ తో పాటు లక్ ఉన్న హీరోగా ఇప్పుడు సుహాస్ కనిపిస్తున్నాడు. చాలా చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సుహాస్, ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్నాడు. విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు.రీసెంటుగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. హీరోగా ఈ సినిమా ఆయనను మరో పై మెట్టు ఎక్కించింది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుహాస్ అంచలంచెలుగా ఎదుగుతున్న తీరు చూస్తుంటే, నానీనే గుర్తుకు వస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుగుతున్న సుహాస్ పేరు, ఇప్పుడు నాని తరువాత స్థానంలో వినిపిస్తూ ఉండటం విశేషం.
Advertisement
Suhas
Actor
Ambajipeta Marriage Band

More Telugu News