మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత
- ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన రాజమల్లు
- 1994లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపు
- 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజమల్లు
తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయింది. తొలుత సుల్తానాబాద్ పీఏసీఎస్ ఛైర్మన్ గా ఆయన గెలిచారు. ఆ తర్వాత 1989లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1994లో మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి దాదాపు 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపు కోసం కృషి చేశారు.