కోలీవుడ్ నటుడు విజయ్ కొత్త పార్టీకి సర్వం సిద్ధం.. రిజిస్ట్రేషనే తరువాయి?
- మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశం
- పార్టీ ప్రారంభించాల్సిందేనని సమావేశంలో డిమాండ్
- తొలిసారి పార్టీ గురించి మాట్లాడిన విజయ్
- లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడమా? ఏదైనా పార్టీకి మద్దతివ్వడమా? అన్నదానిపై త్వరలో నిర్ణయం
విజయ్ కూడా గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. అంతేకాదు, మరో ఆరు నెలల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు కూడా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా? లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాలా? అన్న అంశంపై మరోమారు నిర్వాహకులతో విజయ్ సమావేశమవుతారని సమాచారం.