ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను అమలు చేసేలా పోరాటం చేస్తాం: హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను అమలు చేసేలా పోరాటం చేస్తాం: హరీశ్ రావు

Harish Rao participated in Nalgonda Lok Sabha election review meeting
  • ప్రచారంలో అబద్ధం... పాలనలో అసహనం... ఇదే కాంగ్రెస్ తీరు అని విమర్శ
  • కష్టపడే వారికి మన పార్టీలో గుర్తింపు ఉంటుందని హామీ 
  • కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలని వ్యాఖ్య
పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలు చేసేలా పోరాడాలని నిర్ణయించినట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.  నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రచారంలో అబద్ధం... పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్‌ తీరు అని విమర్శించారు. కష్టపడే వారికి మన పార్టీలో గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యమకారులకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలన్నారు.

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం స్ఫూర్తినిచ్చేలా జరిగిందని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు మంచి సూచనలు చేసినట్లు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ క్రమశిక్షణతో పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేసేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.
Advertisement
Harish Rao
Congress
BRS
Telangana

More Telugu News