గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయాను: చంద్రబాబు
- బాలింతను, చిన్నారిని ఆసుపత్రికి డోలీపై మోసుకురావాల్సి వచ్చిందన్న చంద్రబాబు
- గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శ
- మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలాగని ప్రశ్న
'కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? మృతదేహాన్ని తీసుకు వెళ్ళడానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా? ఏమైపోయాయి అంబులెన్సులు? పుట్టెడు దుఃఖంలో భార్య మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్లాల్సి రావడం ఎంత దయనీయం? ఎంత బాధాకరం? గిరిజనులకు ఎందుకీ దుస్థితి?' అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని... ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.