బెంగళూరుపై కరోనా పంజా.. భారీగా నమోదవుతున్న కొత్త కేసులు
- దేశ వ్యాప్తంగా 4,334 యాక్టివ్ కేసులు
- గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 298 పాజిటివ్ కేసులు
- ఒక్క బెంగళూరులోనే 172 కేసుల నమోదు
దేశంలో జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు 500 దాటాయి. ప్రస్తుతం దేశంలో 541 జేఎన్-1 కేసులు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కర్ణాటకలో అత్యధికంగా 199, ఆ తర్వాత కేరళలో 148 కేసులు ఉన్నాయి. తెలంగాణలో 2 కేసులు ఉన్నాయి. మిజోరం, చండీగఢ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయాలలో కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.