'గుంటూరు కారం'లో పొలిటికల్ ఘాటు.. ఈ నెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్!
- త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం'
- మహేశ్ జోడీగా ఇద్దరు భామలు
- ఇప్పటికే పాప్యులర్ అయిన సాంగ్స్
- ఈ నెల 13వ తేదీన సినిమా రిలీజ్
ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఆ వేదికపై నుంచే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. మహేశ్ బాబును ఇంతకుముందు చూడని విధంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించనున్నాడు. అలాగే మహేశ్ బాబు ఇంతవరకూ వేయని నాటు స్టెప్పులు ఈ సినిమాలో ఆయనతో వేయించాడు. దాంతో ఆడియన్స్ ఈ కొత్తదనానికి బాగా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని పొలిటికల్ ఫైట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని అంటున్నారు.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ జనంలోకి దూసుకుపోయాయి .. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' ఎక్కడ చూసినా వినిపిస్తోంది. శ్రీలీల - మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.