Avesh Khan: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం టీమిండియాలోకి యువ పేసర్ కు పిలుపు

ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాణిస్తున్న యువ పేసర్ అవేష్ ఖాన్ ను టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం అవేష్ ఖాన్ కు కూడా జట్టులో చోటు కల్పించారు. 

సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. షమీ స్థానాన్ని అవేష్ ఖాన్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

అవేష్ ఖాన్ ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ లో టీమిండియాకు ఆడాడు. ఆ సిరీస్ లో రాణించడం ద్వారా ఇప్పుడు టెస్టు గడప తొక్కే అవకాశం చేజిక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ ఏమంత ప్రభావం చూపించకపోవడంతో, రెండో టెస్టు కోసం తుదిజట్టులో అవేష్ ఖాన్ కు స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. 

రెండో టెస్టు  కోసం టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్.
Avesh Khan
Team India
2nd Test
South Africa
Cape Town

More Telugu News