అప్పుడు అలా పుట్టించారు .. ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తున్నారు: మీనా
Add ap7am to your home Screen

అప్పుడు అలా పుట్టించారు .. ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తున్నారు: మీనా

Meena Interview
  • భర్తతో ఎలాంటి గొడవలు ఉండేవి కాదన్న మీనా
  • ఆయన చనిపోతాడని ఊహించలేదని వ్యాఖ్య 
  • ఆ బాధ నుంచి తేరుకుంటున్నానని వెల్లడి 
  • రెండో పెళ్లి అంటూ ప్రచారం చేయడం కరెక్టు కాదని ఆవేదన  
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనా తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నాకు .. మా వారు విద్యాసాగర్ కి మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా పుకార్లు పుట్టించారు. మా వాళ్లు కాల్ చేసి మరీ ఆ విషయాన్ని గురించి అడిగారు. నిజానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్లం" అని చెప్పారు మీనా. 

"విద్యాసాగర్ కి లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ అవసరమైంది. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విదేశాలకి తీసుకుని వెళదామని కూడా అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్లినా వెయిటింగ్ తప్పదన్నారు. ఇదిగో వచ్చేస్తుంది .. అదిగో దొరికేస్తుంది అనే ఆశతోనే ఉన్నాము. ఈ లోగా జరగరానిది జరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను" అని అన్నారు. 

"విద్యాసాగర్ చనిపోయి కొన్ని నెలలు గడవగానే, నేను రెండో పెళ్లి చేసుకోనున్నట్టుగా రాశారు. హీరో ధనుశ్ తో పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఒక రాజకీయనాయకుడితో .. సీనియర్ స్టార్ తో .. బిజినెస్ మేన్ తో ఇలా .. ఎవరితో పడితే వాళ్లతో నా పెళ్లి అన్నట్టుగా రాశారు. నిజమో .. కాదో తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం కరెక్టు కాదు. ఈ ప్రచారాల వలన నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయింది" అంటూ మీనా ఆవేదన వ్యక్తం చేశారు. 
Advertisement
Meena
Vidyasagar
Actress

More Telugu News