అప్పట్లో నాకు గట్టి పోటీ రోజానే: సీనియర్ హీరోయిన్ మీనా
Add ap7am to your home Screen

అప్పట్లో నాకు గట్టి పోటీ రోజానే: సీనియర్ హీరోయిన్ మీనా

Meena Interview
  • బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా 
  • ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా క్రేజ్
  • వివాహమైన తరువాత సినిమాలు తగ్గించిన మీనా 
  • రమ్యకృష్ణ, రోజా,రంభలతో స్నేహం ఉందని వెల్లడి
వెండితెరకి బాలతారలుగా పరిచయమై .. ఆ తరువాత కాలంలో హీరోయిన్స్ గా ఎదిగిన చాలా తక్కువ మందిలో మీనా ఒకరు. తెలుగు .. తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె నటించారు. వివాహమైన తరువాతనే ఆమె సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఆ తరువాత నిదానంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. 

తాజాగా ఐ డ్రీమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ .. "అప్పట్లో రచయితలు నన్ను ఊహించుకుని పాత్రలను రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా గ్లామర్ రోల్స్ చేశాను .. కాకపోతే అవి కంఫర్ట్ లెవెల్స్ దాటేవి కాదు. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసేవారి విషయంలో కాస్త ఎక్కువ హడావిడి కనిపించేది. అలాంటప్పుడు నాకు కూడా ఆ తరహా పాత్రలు చేయాలనిపించేది" అని అన్నారు. 

" నా సమయంలో రోజా .. రమ్యకృష్ణ .. రంభ కూడా చాలా బిజీ. వాళ్లలో రోజాతో నాకు ఎక్కువగా పోటీ నడిచేది. డేట్స్ లేని కారణంగా నేను వదులుకున్న సినిమాలు తను, ఆమె వదిలేసిన సినిమాలు నేను చేస్తూ ఉండేవాళ్లం. ఇప్పటికీ వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. నాకు ముందు నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ తోను స్నేహం కొనసాగుతూ ఉండటం నా అదృష్టం" అని చెప్పారు.
Advertisement
Meena
Roja
Rambha
Ramyakrishna

More Telugu News