Gaza Tunnel: గాజాలో బయటపడ్డ అతిపెద్ద సొరంగం

Biggest Hamas Tunnel With 4 Km Long Network Found Under Gaza Says Israel
షార్ట్స్‌లో చూడండి
గాజాలో అతిభారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్‌కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించింది. చిన్న వాహనాలు సునాయసంగా ప్రయాణించేంత పెద్దదిగా ఈ సొరంగం ఉందని వివరించింది. 

ఈ సొరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండొచ్చని, భారీగా నిధులు ఖర్చయి ఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి, హమాస్ చీఫ్ సోదరుడు మహ్మద్ యాహ్యా ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్టు సైన్యం వెల్లడించింది. ఈ సొరంగం తాలూకు వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Gaza Tunnel
Israel
Israel-Hamas War

More Telugu News