చెన్నై ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకల పునరుద్ధరణ.. ఇంకా పొంచివున్న ముప్పు
- మిగ్జామ్ తుపాను ప్రభావంతో చెన్నై అతలాకుతలం
- ఈ ఉదయం కాస్తంత తెరిపినిచ్చిన వర్షం
- వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి
- చెన్నై సహా పలు ప్రాంతాల్లో నేడు కూడా విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
ఈ ఉదయం వాన తెరిపినిచ్చినప్పటికీ వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో నేడు కూడా చెన్నై సహా పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.