ఎవరేమనుకున్నా డోంట్ కేర్: 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' ఈవెంటులో జీవిత రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరేమనుకున్నా డోంట్ కేర్: 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' ఈవెంటులో జీవిత రాజశేఖర్

Extra Ordinary Man Pre Release Event
  • హైదరాబాదులో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • కీలకమైన పాత్రను పోషించిన రాజశేఖర్
  • ఆ సినిమాలో డైలాగ్ గురించి ప్రస్తావించిన జీవిత 
  • తన ఫ్యామిలీనే తన ప్రపంచమని వెల్లడి

నితిన్ హీరోగా దర్శకుడు వక్కంతం వంశీ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' సినిమాను రూపొందించాడు. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాజశేఖర్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ - ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. 

ఈ సినిమాలో జీవిత మాటనే రాజశేఖర్ వింటారు అనే అర్థం వచ్చేలా ఒక డైలాగ్ ఉంది. ఈ వేదికపై రాజశేఖర్ మాట్లాడుతూ, తన మంచి కోసమే జీవిత చెబుతూ ఉంటుంది గనుక, తాను ఆమె మాటనే వింటానని రాజశేఖర్ అన్నారు. ఆ డైలాగ్ అంతగా పేలుతుందని తాను అనుకోలేదని చెప్పారు. 

ఆ తరువాత జీవిత మాట్లాడుతూ .. "భార్యాభర్తలన్న తరువాత ఒకరిమాట ఒకరు వినాలి .. ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకోవాలి .. ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. మా జీవితం అలాగే సాగింది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ .. మా ఆయన .. నా ఇద్దరు పిల్లలు .. వాళ్లే నా ప్రపంచం. వాళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. ఇక డిఫరెంట్ గా ఉండాలేగానీ, రాజశేఖర్ ఈ తరహా పాత్రలు చేయడానికి ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఉన్నారు" అని అన్నారు.


Advertisement
Nithin
Sreeleela
Rajasekhar
Extra Ordinary Man

More Telugu News