Team India: రాణించిన ఆసీస్ బౌలర్లు... ఈసారి 200 లోపే టీమిండియా స్కోరు

Team India scores 174 runs for 0 wickets in 4th T20
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ ల్లో ప్రతిసారి 200కి పైగా పరుగులు స్కోరు చేసిన టీమిండియా... నాలుగో టీ20లో మాత్రం ఆ పని చేయలేకపోయింది. రాయ్ పూర్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. 

ఆసీస్ బౌలర్లు సమయోచితంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు నమోదు చేయగలిగింది. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ 19 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సులతో 35 పరుగులు సాధించాడు.

 ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 37, రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షూయిస్ 3, జాసన్ బెహ్రెండార్ఫ్ 2, తన్వీర్ సంఘా 2, ఆరోన్ హార్డీ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Team India
Australia
4th T20
Raipur

More Telugu News