'బిగ్ బాస్' కి నేను కప్పు కోసం వచ్చాను .. కాఫీ కోసం కాదు: యావర్ పై శోభా ఫైర్
Add ap7am to your home Screen

'బిగ్ బాస్' కి నేను కప్పు కోసం వచ్చాను .. కాఫీ కోసం కాదు: యావర్ పై శోభా ఫైర్

Bigg Boss 7 Update
  • బిగ్ బాస్ హౌస్ లో 85వ రోజు 
  • వేడిగా జరిగిన నామినేషన్స్  
  • శివాజీ ధోరణిని తప్పుబట్టిన గౌతమ్ 
  • ప్రియాంక కోపం గురించి ప్రస్తావించిన శివాజీ
  • జనాలు చూస్తున్నారంటూ అసహనం

బిగ్ బాస్ హౌస్ లో 85వ రోజున నామినేషన్స్ కాస్త వేడిగానే జరిగాయి. నామినేషన్స్  విషయంలో వాదనలు గట్టిగానే జరిగాయి. శివాజీని నామినేట్ చేసిన గౌతమ్ అతని ధోరణిని తప్పుబట్టాడు. "మీ చుట్టూ తిరుగుతూ .. మిమ్మల్ని ఎవరైతే పొగుడుతూ ఉంటారో వాళ్లని మీరు సపోర్టు చేస్తారు .. మిగతా వాళ్లను నామినేట్ చేస్తారు. నా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు" అన్నాడు. "నువ్వు ఫెయిర్ కాదని ఇప్పుడు చెబుతున్నాను'' అంటూ శివాజీ అసహనాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత ప్రియాంక కూడా శివాజీని నామినేట్ చేసింది. తాను అబద్ధాలు ఆడతాననే విషయాన్నీ జనంలోకి వెళ్లేలా చేయడం తనకి బాధను కలిగించిందని అంది. కొంతమందిని కవర్ చేయడం .. మరికొంతమందిని తప్పుబట్టడం కరెక్ట్ కాదని వాదించింది. ఆమెకి కోపం ఎక్కువనీ .. కిచెన్ లో ఆమె కొంతమందితో మాట్లాడిన తీరుకి తాను చాలా ఫీలయ్యానని శివాజీ అన్నాడు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారనీ, వాళ్లేమీ పిచ్చోళ్లు కాదని చెప్పాడు. ఇక ప్రశాంత్ ను .. యావర్ ను నామినేట్ చేసిన శోభ, ఆ ఇద్దరితో గట్టిగానే వాదించింది. తనని నామినేట్ చేసే రీజన్ ను యావర్ ఒప్పుకోలేదు. 'నేను అలా చేయడం నువ్వు చూశావా' అంటూ మండిపడ్డాడు. దాంతో మాటా మాట పెరిగింది. 'బిగ్ బాస్ హౌస్ కి తాను కప్పు కోసం వచ్చాననీ, కాఫీ కోసం రాలేదని శోభా ఫైర్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో 'అమర్' ఒక్కడూ లేకపోవడం విశేషం. 

Advertisement
Bigg Boss
Sobha
Yavar
Shivaji
Goutham
Priyanka

More Telugu News