'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్' ట్రైలర్ రిలీజ్
- 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్'గా నితిన్
- దర్శకుడిగా వక్కంతం వంశీకి రెండో సినిమా
- ప్రధానమైన పాత్రలను కవర్ చేసిన ట్రైలర్
- కథానాయికగా సందడి చేయనున్న శ్రీలీల
- డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల
దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది రెండో సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆయన ఈ కంటెంట్ ను రెడీ చేసుకున్నాడు. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కామెడీ .. యాక్షన్ ప్రధానమైన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. నితిన్ సరసన నాయికగా ఈ సినిమాలో శ్రీలీల అలరించనుంది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇక 'స్కంద' .. 'ఆదికేశవ' ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన శ్రీలీలకి కూడా హిట్ చాలా అవసరమే.