శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైంది: కేసీఆర్‌పై అన్నామలై తీవ్ర విమర్శలు

21-11-2023 Tue 18:53 | Telangana
Advertisement
  • కేసీఆర్ పార్టీ కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని చురకలు
  • ఒక పార్టీ ఒక వ్యక్తి చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదన్న అన్నామలై
  • 8 కోట్ల జనాభా ఉన్న తమిళనాడు అప్పు రూ.7 లక్షల కోట్లుగా ఉందని వెల్లడి
  • కానీ 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ అప్పు రూ.6.5 లక్షల కోట్లుగా ఉందని విమర్శలు
Advertisement
తెలంగాణలో కేసీఆర్ పార్టీ... కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని, ఓ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ లేదా ఒక కుటుంబం చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదని, శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణలోని శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విభజన తర్వాత కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఎనిమిది కోట్ల జనాభా కలిగిన తమిళనాడుకు రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే, 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రూ.6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని ఆరోపించారు.

దేశమంతా ఇప్పుడు నరేంద్రమోదీ మోడల్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్‌గా మారిందని విమర్శించారు. బీజేపీ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అయితే బీఆర్ఎస్‌కు మజ్లిస్ బీ టీమ్ అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన రైతు ఇన్సూరెన్స్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీఇండియాగా ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే ఉదేశ్యంతో పార్టీ అధిష్ఠానం రవికుమార్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చిందన్నారు. ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
annamalaiBJP

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more