సన్నాసులు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

సన్నాసులు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

YS Sharmila sensational comments on KCR and KTR
  • అధికారమదంతో కళ్లు నెత్తికెక్కాయన్న షర్మిల
  • విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శ
  • ఓట్లు అడగడానికి ఇజ్జత్ ఉండాలని వ్యాఖ్య
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్టుందంటూ కేసీఆర్, కేటీఆర్ లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి, 12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇళ్లు కట్టడం చేతకానోడికి మళ్లీ అధికారమిస్తే వడ్లు పండించినట్లు వరద పారిస్తాడట అని విమర్శించారు. చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నట్లుంది కేసీఆర్ తీరు అని అన్నారు. ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే చిన్న దొరకు జనం చెత్త నా కొడుకులు, సన్నాసులు లెక్క కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారమదంతో కళ్లు నెత్తికెక్కితే నిరుద్యోగులు సన్నాసుల్లా కనిపిస్తున్నారా కేటీఆర్ గారు? అని మండిపడ్డారు. 

ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చిన సన్నాసులు నువ్వు, మీ నాయన... ఉద్యోగాలు నింపలేక పేపర్లు లీకులు చేసి అమ్ముకున్న పెద్ద సన్నాసివి నువ్వే అని అన్నారు. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన సన్నాసుల పాలన మీది అని విమర్శించారు. నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న మీకు ఓట్లు అడగడానికి ఇజ్జత్ ఉండాలని అన్నారు. బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించి, అందిన కాడికి దోచుకొని, మళ్లీ గెలిస్తే ఇండ్లిస్తాం, ఉద్యోగాలిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు.
Advertisement
YS Sharmila
YSRTP
KCR
KTR
BRS

More Telugu News