రేపు ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ బృందం
- ఏపీలో ఓటరు జాబితా అక్రమాలు జరుగుతున్నాయంటున్న టీడీపీ
- రేపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ నేతలు
- టీడీపీ బృందంలో అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల
వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, విపక్షాల మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఓటరు జాబితా అక్రమాలపై పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ను కలిసి పలుమార్లు ఫిర్యాదులు చేశారు.