రేపు ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ బృందం

TDP leaders will go to Delhi tomorrow
అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించడంతో టీడీపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. టీడీపీ నేతల బృందం రేపు ఢిల్లీ వెళ్లనుంది. టీడీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు... ఇదే విషయాన్ని ఈసీకి వివరించనున్నారు. టీడీపీ బృందంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ ఉంటారని తెలుస్తోంది. 

వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, విపక్షాల మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఓటరు జాబితా అక్రమాలపై పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ను కలిసి పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
Go Back to Shorts
TDP
New Delhi
Election Commission Of India
Voter List
YSRCP
Andhra Pradesh

More Telugu News