కోల్ కతాలో వాన... నిలిచిన ఆసీస్-దక్షిణాఫ్రికా సెమీస్
- వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీస్ పోరు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- అనుకూల పరిస్థితుల్లో విజృంభించిన ఆసీస్ పేసర్లు
- 14 ఓవర్లప్పుడు వర్షం
- వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయిన సమయానికి దక్షిణాఫ్రికా 44-4
వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. సఫారీ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ (10 బ్యాటింగ్), డేవిడ్ మిల్లర్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు.
పిచ్ పై కాస్త తేమ ఉండడం, స్వింగ్ లభించడం వంటి కారణాలతో ఆసీస్ పేసర్లు పదునైన బంతులతో విరుచుకుపడ్డారు. తొలి పవర్ ప్లేలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత మరో రెండు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.