టీమిండియా ఘన విజయంపై సత్య నాదెళ్ల సంతోషం
Add ap7am to your home Screen

టీమిండియా ఘన విజయంపై సత్య నాదెళ్ల సంతోషం

Satya Nadella response on Team India win
  • న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన టీమిండియా
  • రాత్రంతా మేల్కొని మ్యాచ్ చూశానన్న సత్య నాదెళ్ల
  • ఇండియా ఫైనల్స్ కు వెళ్లడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను టీమిండియా చిత్తు చేసిన తీరును చూసి కోట్లాది మంది సంబరాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ ను యావత్ దేశం ఆసక్తిగా తిలకించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా టీవీకి అతుక్కుపోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. సియాలెట్ లో జరిగిన మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో కీలక ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత తాను మ్యాచ్ లో పూర్తిగా మునిగిపోయానని చెప్పారు. రాత్రంతా మేల్కొని మ్యాచ్ ను వీక్షించానని తెలిపారు. టీమిండియా సెమీస్ లో ఘన విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకుపోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
Advertisement
Satya Nadella
Microsoft
Team India
ODI World Cup

More Telugu News