హమాస్ అధినేత ఇంటిపై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇస్మాయిల్ హనియే ఇల్లు ధ్వంసం
- 2006లో ప్రధానమంత్రి అయిన హనియే
- 2017లో హమాస్ అధినేత అయిన వైనం
1990లలో ఇస్మాయిల్ హనియే లైమ్ లైట్ లోకి వచ్చారు. అప్పట్లో ఆయన హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ కు కుడిభుజంగా ఉన్నారు. 2004లో యాసిన్ హత్యకు గురయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో హమాస్ గ్రూపు గెలుపొందింది. హనియే ప్రధానమంత్రి అయ్యారు. 2017లో ఆయన హమాస్ అధినేత అయ్యారు.