స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- సీఐడీ తరపున ఈరోజు వాదనలు వినిపించిన పొన్నవోలు
- బాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను కోర్టుకు సమర్పించిన ఆయన లాయర్లు
- మిగిలిన వాదనలు రేపు వింటామన్న హైకోర్టు
చంద్రబాబు కంటికి ఆపరేషన్ నిర్వహించామని... ఆయన కోలుకోవడానికి మందులు వాడాలని డాక్టర్లు నివేదికలో తెలిపారు. ఐదు వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చామని... ఐదు వారాల పాటు ఇన్ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలని, కంట్లో చుక్కల మందు వేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారని... గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మిగిలిన వాదనలు రేపు వింటామని తెలిపింది.