రేవంత్ రెడ్డీ... ప్రజలకు ఇందిర ఆస్తులు రాసిస్తే మరుక్షణమే నేనూ రాసిస్తా: కడియం శ్రీహరి సవాల్
- రాజయ్య చేతిలో గత ఎన్నికల్లో ఇందిర చిత్తుగా ఓడిందన్న కడియం శ్రీహరి
- కడియం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు వెల్లడి
- తనపై ఎలాంటి కేసులు లేవన్న కడియం శ్రీహరి
- రేవంత్ రెడ్డి, ఇందిరలపై కేసులు ఉన్నాయన్న కడియం
తనపై ఎలాంటి కేసులు లేవని, కానీ రేవంత్ రెడ్డి, ఇందిరలపై ఉన్నాయన్నారు. ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు, మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు. ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు.