కుటుంబ సభ్యులతో కలిసి ధర్మశాల క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన కేశినేని నాని... ఫొటోలు ఇవిగో!

TDP MP Kesineni Nani visits Dharmashala cricket stadium with family members
టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి  హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియం నుంచి కనిపిస్తున్న హిమాలయ పర్వతాల అందాలను ఎంతో అపురూపంగా వీక్షించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

"సమున్నతమైన హిమాలయ పర్వత శ్రేణి నడుమ కొలువుదీరిన ధర్మశాల క్రికెట్ స్టేడియంను సందర్శించాం. సముద్ర మట్టం నుంచి చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన క్రికెట్ స్టేడియం. మంచుతో కప్పేసిన పర్వత శిఖరాలు, పచ్చదనం సంతరించుకున్న గిరులు, విసురుగా వీచే కొండ గాలి నడుమ ధర్మశాల స్టేడియంలో లభించే క్రికెట్ అనుభూతి మరెక్కడా దొరకదు. మీరు క్రికెట్ అభిమాని అయినా, ప్రకృతి ప్రేమికుడు అయినా సరే... ఇక్కడి మాయలో పడిపోవాల్సిందే" అని కేశినేని నాని ఫేస్ బుక్ లో వివరించారు.
Go Back to Shorts
Kesineni Nani
Dharmashala
Cricket Stadium
Himalayas
Himachal Pradesh
TDP
Andhra Pradesh

More Telugu News