గిన్నిస్ బుక్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య

Anchor Suma grand father Guinness record
  • ఎక్కువ కాలం న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు
  • ఆయన వయసు 98 ఏళ్లు
  • గత 73 ఏళ్లుగా న్యాయవాదిగా సేవలందిస్తున్న ఘనత
బుల్లితెర టాప్ యాంకర్ సుమ ఆనందంలో మునిగి తేలుతున్నారు. దీనికి కారణం... ఆమె తాతయ్య (అమ్మమ్మ తమ్ముడు) పీబీ మీనన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కడమే. పీబీ మీనన్ వయసు 98 ఏళ్లు. గత 73 ఏళ్లుగా ఆయన న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఎక్కువ కాలంపాటు న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తిగా ఆయన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా సుమ స్పందిస్తూ... తాతయ్యే తన సూపర్ హీరో అని చెప్పారు. తనతో పాటు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. తన తాత గిన్నిస్ రికార్డును అందుకున్న ఫొటోను సుమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుమ తాతయ్య 73 ఏళ్ల 60 రోజులుగా న్యాయవాద వృత్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. 
Advertisement
Anchor Suma
Grand Father
Guinness Record

More Telugu News