ప్రపంచకప్‌లో నేడు మరో కీలక మ్యాచ్.. కివీస్‌పై టాస్ గెలిచిన పాకిస్థాన్.. కేన్ మామ రాకతో నూతనోత్సాహంలో న్యూజిలాండ్
- బ్యాటిింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- గెలిచిన జట్టుకు సెమీస్ చాన్స్
- మిర్ స్థానంలో హసన్ అలీని రంగంలోకి దింపిన పాక్
టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడంతో ఆ జట్టుకు అదనపు బలం చేకూరినట్టే. కేన్ జట్టులోకి రావడంతో విల్ యంగ్ తప్పుకోగా, మ్యాట్ హెన్రీ స్థానంలో ఇష్ సోది జట్టులోకి వచ్చాడు. ఇక పాకిస్థాన్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఉస్మాన్ మిర్ స్థానంలో హసన్ అలీని రంగంలోకి దింపింది.