సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
- 8 క్యాలెండర్ ఇయర్లలో జరిగిన వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన విరాట్
- సచిన్ ఏడు సార్లు ఈ ఘనత సాధించిన వైనం
- శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ రికార్డు అధిగమించిన కోహ్లీ
ఇప్పటివరకూ ఉన్న రికార్డు ఇవే..
- విరాట్ కోహ్లీ 2011-14 మధ్య, 2017-19 మధ్య, ఈ ఏడాది కలిసి మొత్తం 8 మార్లు వన్డేల్లో వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
- సచిన్ 1994లో, 1996-98 మధ్య, 2000, 2003, 2007లో వన్డేల్లో వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
కాగా, శ్రీలంకపై విజయంతో భారత్ వరల్డ్ కప్‌లో సెమీస్‌లో కాలుపెట్టిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. షమీ, సిరాజ్ దూకుడుకు శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకే అయ్యింది.