Chandrababu: అమరావతి నుంచి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు.. షెడ్యూల్ వివరాలు ఇవిగో!

Chandrababu coming to Hyderabad today
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిన్న బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. వాస్తవానికి ఆయన ఈరోజు తిరుమలకు వెళ్లి, శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే, తిరుమల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ సాయంత్రం ఆయన నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. 

చంద్రబాబు నేటి షెడ్యూల్:
  • మధ్యాహ్నం 3 గంటలకు - ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు
  • 3.45 గంటలకు - విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరిక
  • 4.00 గంటలకు - శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనం
  • 4.45 గంటలకు - హైదరాబాద్ చేరిక
  • 5 గంటలకు - ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి పయనం
  • 5.50 గంటలకు - జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు

Go Back to Shorts
Chandrababu
Telugudesam
Hyderabad

More Telugu News