వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డుకు చేరువవ్వడంపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ
- సచిన్ 49 సెంచరీలు చేయగా, కోహ్లీ 48 సెంచరీలు చేసిన వైనం
- ఇన్ని రికార్డులు సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్య
- అంతా అనుకున్నట్టే కచ్చితంగా జరగాలని భావించలేదని వెల్లడి
కాగా కింగ్ విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 49వ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా గురువారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొడితే సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డ్ 49 వన్డే సెంచరీలను సమం చేయనున్నాడు. ఈ వరల్డ్ కప్‌లోనే 50 వన్డే సెంచరీలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా జరిగితే వన్డేల్లో 50 సెంచరీల మొనగాడిగా కోహ్లీ నిలవబోతున్నాడు.
నిజానికి ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లీ సచిన్ రికార్డును సమం చేస్తాడని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో సెంచరీ చేజారింది. దీంతో శ్రీలంకపై కోహ్లీ సెంచరీ నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదివుండగా భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలతో మొత్తం 354 పరుగులు నమోదు చేశాడు.