మొన్న మిచెల్.. నిన్న బట్లర్.. కుల్దీప్ మ్యాజిక్ బంతికి బిత్తరపోయిన ఇంగ్లండ్ స్కిప్పర్.. వీడియో ఇదిగో!
- లక్నోలో గతరాత్రి ఇంగ్లండ్‌తో మ్యాచ్
- కుల్దీప్ బంతిని అంచనా వేయడంలో బట్లర్ విఫలం
- మిడిల్ స్టంప్‌ను గిరాటేసిన బంతి
16వ ఓవర్ తొలి బంతికే ఈ ఘటన జరిగింది. అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌లో పిచ్ అయిన బంతి ఒక్కసారిగా టర్న్ అయి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. బంతిని అంచనా వేయడంలో విఫలమైన బట్లర్ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. అనూహ్యంగా టర్న్ అయిన బంతి వికెట్లను పడగొట్టడంతో బట్లర్ షాకయ్యాడు. కాసేపటి వరకు కోలుకోలేకపోయాడు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. కుల్దీప్ ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు ఆ బంతిని ‘బాల్ ఆఫ్ ద వన్డే ప్రపంచకప్’ అని కొనియాడుతున్నారు.