రోహిత్ సేన కప్ గెలుస్తుందా అన్న ప్రశ్నకు ధోనీ ఏమన్నాడంటే..!
- జట్టు కూర్పు అద్భుతంగా ఉందన్న మాజీ కెప్టెన్
- టీమ్ లో అందరూ బాగా ఆడుతున్నారని మెచ్చుకోలు
- తెలివైన వాళ్లకు ఈ మాత్రం హింట్ చాలంటూ వ్యాఖ్య
ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువగా మాట్లాడనని అంటూ.. తెలివైన వారికి ఈమాత్రం హింట్ చాలని, అర్థం చేసుకుంటారని మిస్టర్ కూల్ వ్యాఖ్యానించాడు. రోహిత్ సేన వరల్డ్ కప్ ను అందుకుంటుందని ధోనీ పరోక్షంగా చెప్పాడు. గురువారం ఓ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ జవాబిచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత జట్టు 2011 వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా 2013లో ఛాంపియన్స్ ట్రోపీని కూడా ధోని కెప్టెన్సీలోనే సాధించింది.