72 ఏళ్ల వయసులో సైకిల్ తొక్కుతూ టీడీపీ పట్ల విధేయత చాటిన అశోక్ గజపతిరాజు

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పార్టీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి పరామర్శ యాత్రకు మద్దతు పలికారు. 72 ఏళ్ల వయసులో, టీడీపీ గుర్తు అయిన సైకిల్ తొక్కుతూ పార్టీ పట్ల తన విధేయత చాటారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. రాజకీయాలంటే విధేయత, నిగర్వం, నిజాయతీ అని నమ్మిన రాచబిడ్డ అశోక్ గజపతిరాజు అని కొనియాడింది.


More Telugu News