న్యూజిలాండ్‌పై గెలుపు తర్వాత ఒకే కారులో విరాట్, రోహిత్ ప్రయాణం.. వీడియో ఇదిగో
- కివీస్‌పై గెలుపును ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్న స్టార్ క్రికెటర్లు
- మ్యాచ్ తర్వాత ఇద్దరూ ఎక్కడికో వెళ్లారంటూ వీడియో వైరల్
- ఆటగాళ్ల మధ్య సానుకూల వాతావరణం మంచిదేనంటున్న ఫ్యాన్స్
కివీస్‌పై గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన కింగ్ విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విజయాన్ని మరింత ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీని హిట్‌మ్యాన్ ఆప్యాయంగా హత్తుకున్నాడు. శెభాష్ అంటూ మెచ్చుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతర దృశ్యాలు వీరిద్దరి మధ్య సుహృద్భావం, సోదరభావం మరోసారి చర్చకు వచ్చేలా చేశాయి. న్యూజిలాండ్‌పై గెలుపుని వీరిద్దరూ ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయిు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఒకే కారులో బయటకు వెళ్లారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇరువురూ కారు ఎక్కుతూ కనిపించారు. ఎక్కడికి వెళ్లారు, ఏమిటి సంగతి? అన్న వివరాలు చెప్పలేదు. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియరాలేదు. ఏదేమైనా వరల్డ్ కప్ వేళ ఆటగాళ్ల మధ్య ఇలాంటి సానుకూల వాతావరణం జట్టుకు ఉపయోగపడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.