ఇజ్రాయెల్ విషయంలో స్టాండ్ మార్చిన చైనా
- తొలుత పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడిన చైనా అధ్యక్షుడు
- తాజాగా మాట మార్చిన చైనా
- దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందన్న చైనా విదేశాంగ మంత్రి
గత వారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ... ఇజ్రాయెల్ వెంటనే కాల్పులను విరమించాలని చెప్పారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించేందుకు ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ఇప్పుడు చైనా తన స్టాండ్ ను మార్చుకుని, ఇజ్రాయెల్ కు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.