గాజా రక్తసిక్తం.. ఇజ్రాయెల్ దాడుల్లో 24 గంటల్లో 266 మంది పాలస్తీనియన్ల మృతి
- ఇజ్రాయెల్ బాంబు దాడిలో కుప్పకూలిన భవనం
- భవనంలోని 30 మంది మృతి
- గత రెండువారాల్లో మరణించిన 4,600 మంది పాలస్తీనియన్లు
- హమాస్ దాడిలో 1400 మంది ఇజ్రాయెలీల మృతి
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 266 మంది మరణించారని, వీరిలో 117 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత రెండు వారాలుగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 4,600 మంది మరణించారని గాజాలోని అధికార వర్గాలు తెలిపాయి. హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు.