జాతీయ అవార్డు అందుకోవడానికి సతీసమేతంగా ఢిల్లీ బయల్దేరిన అల్లు అర్జున్

Allu Arjun leaves for Delhi to receive national award
  • పుష్ప చిత్రంలో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్
  • జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన కేంద్రం
  • రేపు ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
'పుష్ప' చిత్రంలో సర్వోత్తమమైన నటనకు గాను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వరించడం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రేపు సాయంత్రం జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు.

 రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో తన అవార్డు అందుకునేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా ఢిల్లీ బయల్దేరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులను కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా రిలీజైన కొన్ని నెలల పాటు పాన్ ఇండియా లెవల్లో బన్నీ పేరు మార్మోగిపోయింది. మళ్లీ జాతీయ అవార్డు ప్రకటనతో మరోసారి నేషనల్ లెవల్లో ఐకాన్ స్టార్ కోలాహలం నెలకొంది.
Advertisement
Allu Arjun
National Award
Pushpa
New Delhi
Tollywood

More Telugu News