Jagan: జగన్.. నీ చెల్లెలు షర్మిల రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుందో చెప్పే దమ్ము నీకు ఉందా?: జనసేన నేత షేక్ రియాజ్

Jagan can you tell why your sister Sharmila had two marriages asks Janasena leader Riaz
  • మీ నాన్న హెలికాప్టర్ లో మిస్ అయినప్పుడు ఏ ప్యాలస్ లో ఎవరితో ఉన్నావో చెప్పాలా అన్న జనసేన నేత
  • ఎంతో మంది ఆడవాళ్లను మానభంగం చేసిన చరిత్ర మీ తాతదని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదని విమర్శ
తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జనసేన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి షేక్ రియాజ్ అన్నారు. నిజంగా జగన్ యుద్ధం చేయాలని అనుకుంటే... ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు. పవన్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మేం మాట్లాడదలుచుకుంటే మీ కుటుంబ నీచమైన చరిత్ర గురించి మాట్లాడగలమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మీ నాన్న హెలికాప్టర్ లో మిస్ అయినప్పుడు నీవు ఏ ప్యాలస్ లో, ఎవరితో ఉన్నావో మేము చెపితే గుండె ఆగి చచ్చిపోతావని అన్నారు. సొంత చెల్లిని, తల్లిని ఇంటి నుంచి, రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తివి నీవని... బాబాయిని చంపేసిన వ్యక్తిని కాపాడుతూ, మరో చెల్లిని బాధపెడుతున్న వ్యక్తివి నీవని విమర్శించారు. ఒక కౌరవ సామ్రాజ్యానికి అధినేతవని... ఇన్నేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయావని చెప్పారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే వ్యక్తివని దుయ్యబట్టారు. 

మా జగనన్న సింహం అని మీ నాయకులు అంటుంటారని... సింహం క్రూర జంతువని, నీవు కూడా క్రూరుడివని అన్నారు. పవన్ గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని భయపడుతున్నావని ఎద్దేవా చేశారు. నీ సొంత చెల్లెలు షర్మిల రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుందో చెప్పే దమ్ము నీకుందా జగన్? అని ప్రశ్నించారు. మీ ముత్తాత రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో చెప్పే దమ్ముందా? అని అన్నారు. కడప జిల్లాలో ఎంతో మంది ఆడవాళ్లను మానభంగం చేసిన చరిత్ర నీ తాతదని చెప్పారు. ఇలాంటి చరిత్ర గల కుటుంబంలో పుట్టిన నీవు మా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడతావా? అని మండిపడ్డారు. 

నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పాలసీల గురించి మాట్లాడు అని సవాల్ విసిరారు. రెండు నిమిషాలు కూడా పేపర్ చూడకుండా మాట్లాడలేని నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని అన్నారు. నీ తల్లి, నీ చెల్లి కూడా నిన్ను అసహ్యించుకుంటున్నారని చెప్పారు. నువ్వా పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడేదని మండిపడ్డారు. పెళ్లాలను హింసించిన చరిత్ర పవన్ ది కాదని అన్నారు. నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Riaz
YS Sharmila
YSRTP

More Telugu News